Vice President Jagdeep Dhankhad Visit to Visakha ఉపరాష్ట్రపతి తొలి విశాఖ పర్యటన..ఘనంగా స్వాగత వేడుకలు... - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 28, 2023, 4:32 PM IST
Vice President Jagdeep Dhankhad Visit to Visakha : తొలిసారిగా విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు నౌకాదళ విమానాశ్రయం INS డేగ వద్ద ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సహా పలువురు మంత్రులు ఉన్నతాధికారులు ధన్‌ఖడ్‌కు స్వాగతం పలికారు. తూర్పునౌకాదల ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ పెంధార్కర్ ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు.
Vice President First Time Visakha Tour 2023 : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు నౌక దళ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన ఆంధ్ర వైద్య కళాశాల వందేళ్ల వేడుకల్లో పాల్గొన్నారు. పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత క్యాబ్పై లాన్‌ను ఆవిష్కరించారు. ఆంధ్ర వైద్య కళాశాల వార్షికోత్సవాల్లో పాల్గన్న ఉపముఖ్యమంత్రి కళాశాలలో పలు అభివృద్ధి పనులను ఆవిష్కరించారు. ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి జగధీప్ ధన్‌ఖడ్ కు విశాఖ పర్యటన మొదటి సారి కావడం విశేషం.