Velugu VOA Employees Agitation in Visakha: కష్టపడి పని చేస్తున్నా.. కనీస వేతనాలేవీ..? విశాఖలో వెలుగు వీవోఏల ఆందోళన - విశాఖ లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 7:10 PM IST

Velugu VOA Employees Agitation in Visakha:  కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వెలుగు వీవోఏ(Village Organization Assistant) ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కీలకపాత్ర వహిస్తున్న తమను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని వీవోఏ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న తమకు ఎప్పటికీ ఎనిమిది వేల రూపాయలే జీతాలు నిర్ణయించడం సమంజసం కాదని.. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాము కష్టించి పనిచేస్తే ఎస్ఎల్ఎఫ్ ఎకౌంట్లో జీతాలు వేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. జీతాలు పెంచడంతోపాటు రోజువారి వర్క్ డన్ విధానాన్ని రద్దు చేయాలని.. తమ జీవితాలు తమ అకౌంట్లోనే పడే విధంగా చర్యలు తీసుకోవాలని.. పని భారం తగ్గించాలని నినాదాలు చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్​లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.