జేసీ డెడ్లైన్ - ఎట్టకేలకు ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణ - reddy community
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 3:35 PM IST
Uyyalawada Narasimha Reddy Statue Unveiled by Reddy Community Leaders : అనంతపురం నగరంలో మొదటి నుంచి వివాదాస్పదంగా మారిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి విగ్రహాన్ని ఎట్టకేలకు ఆవిష్కరించారు. గత ఆదివారం విగ్రహావిష్కరణకు యత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో వైసీపీ ఎమ్మెల్యే హస్తం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది.
Uyyalawada statue Opening : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఆవిష్కరించడంలో జరిగిన జాప్యంపై తెలుగు దేశం నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బుధవారం స్పందించారు. విగ్రహావిష్కరణకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే తానే ఆవిష్కరిస్తానని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ రెడ్డి సంఘం నాయకులు ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇబ్బందులన్నీ అధిగమించి విగ్రహాన్ని ఆవిష్కరించామని రెడ్డి సంఘం అధ్యక్షుడు నరేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా ఉయ్యాలవాడ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసేలా బోర్డు వేయిస్తామని వెల్లడించారు. ఇందుకు సహకరించిన నాయకులకు, రెడ్డి సంఘం సభ్యులకు కృతజ్ఞత తెలిపారు.