జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం - నాలుగురోజుల్లో ముగియనున్న గడువు - ప్రిలిమ్స్ మెయిన్స్ విద్యార్థులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 10:15 AM IST

Updated : Dec 15, 2023, 2:46 PM IST

UPSC Candidates Can Apply Jagananna Civil Services Incentive: జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీని ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు తోడ్పాటు కలగనుంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు. 2023 యూపీఎస్సీ మెయిన్స్​లో అర్హత సాధించిన అభ్యర్ధులు అంతా డిసెంబరు 19 తేదీలోగా దరఖాస్తు చేయాలని ప్రభుత్వం ఈ ప్రకటనలో సూచించింది. 

Financial assistance to prelims and mains students: ప్రిలిమ్స్​లో ఉత్తీర్ణత సాధించిన వారికి లక్ష రూపాయలు, మెయిన్స్​లో ఉత్తీర్ణులైన వారికి 50 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తామని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన వారు (Jnanabhoomi.AP.GOV.IN) ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానంలో ఎటువంటి సర్వర్ లోపాలు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు పాటించనున్నట్లు తెలిపింది.

Last Updated : Dec 15, 2023, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.