కనీస వసతులూ కరవే - సమస్యలపై రోడ్డెక్కిన జేఎన్టీయూ విద్యార్థులు - jntu students problems
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 4:59 PM IST
Students demand to solve their problems : విజయనగరం జిల్లాలో గురజాడ వద్ద జేఎన్టీయూ (JAWAHARLAL NEHRU TECHNOLOGICAL UNIVERSITY) విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ హాస్టల్స్‌లో కనీస వసతులు అందించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.
హాస్టల్లో ఆహారం, నీరు సరిగ్గా ఉండటమే లేదు. తరగతుల్లో ఫ్యాన్లు కూడా పనిచేయల్లేదు . నాలుగు సంవత్సరాలు పూర్తైనా ఉద్యోగాల నియామకాలు లేవు. - యూనివర్సిటీ విద్యార్థిని
గ్రంథాలయంలో పుస్తకాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఒకే పుస్తకాన్ని పది మంది చదువుతున్నామని పేర్కొన్నారు. ల్యాబ్లో పరికరాలు (LAB EQUIPMENTS) ఏమి సక్రమంగా లేవని.. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. యూనివర్సిటీ ఎదుట విద్యార్థుల బైఠాయించి నిరసనలు చేశారు. విద్యార్థుల సమస్యలను పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని నిట్టూర్చారు. సమస్యల పరిష్కారానికై యూనివర్సిటీ ఉపకులపతి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.