Central Minister on TDP Support: టీడీపీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం: కేంద్ర సహాయ మంత్రి నారాయణస్వామి
🎬 Watch Now: Feature Video
Interesting comments of Union Minister of State: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఏపీలో తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందనే ఆశాభావాన్ని కేంద్ర సామాజిక, న్యాయ సాధికార శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అన్నింటినీ కలుపుకొని ఎన్నికలకు వెళతాం అని పేర్కొన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో కేంద్ర సామాజిక, న్యాయ సాధికార శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా పావగడ వెళ్తున్న ఆయన మార్గమధ్యంలో మడకశిర పట్టణంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గతంలో మాదిరిగానే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అన్నింటి మద్దతు ఉంటుందని, అందులో భాగంగానే ఏపీలోనూ టీడీపీ మద్దతు కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్లో పార్టీ బలోపేతం కోసమే పురందేశ్వరిని అధ్యక్షులుగా నియమించినట్లు వెల్లడించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలే భారతీయ జనతా పార్టీకి శ్రీరామరక్ష అని తెలిపారు.