'వన్​ నేషన్- వన్​ క్యాస్ట్​- వన్​ రిజర్వేషన్​ ప్రాతిపదికన రజకులను ఎస్సీల్లో చేర్చాలి' - రజకులను ఎస్సీ జాబితా పై వీరేంద్రకుమార్ కఠిక్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 1:08 PM IST

Union Minister of Social Justice Virendra Kumar Khatik Response on Demand to include Rajakulu in SC list : రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ పై కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్రకుమార్ కఠిక్ (Union Minister of Social Justice Virendra Kumar Khatik) సానుకూలంగా స్పందించారని అఖిల భారత దోబీ సంఘం అధ్యక్షుడు అన్నవరపు నాగమల్లేశ్వరరావు తెలిపారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్న రజకులు 11 రాష్ట్రాల్లో మాత్రం ఓబీసీలుగా ఉన్నారన్నారు. ప్రధాని మోదీ చెబుతున్న వన్ నేషన్ వన్ క్యాస్ట్ వన్ రిజర్వేషన్ ప్రాతిపదికన రజకులను ఎస్సీల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

తమ పోరాటానికి, విజ్ఞప్తులకు స్పందించి కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించటం పట్ల నాగమల్లేశ్వరరావు సంతోషం వెలిబుచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా కేంద్రమంత్రి తీసుకెళ్లినట్లు చెప్పారు. రజకుల్ని ఎస్సీల్లో చేర్చాలన్న డిమాండ్ వీలైనంత త్వరగా నెరవేర్చాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.