Union Minister Nitin Gadkari on Chandrababu: చంద్రబాబు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదు: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ - Union Minister Nitin Gadkari comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 21, 2023, 7:01 PM IST
Union Minister Nitin Gadkari on Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి యోగక్షేమాల గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనను అడిగి తెలుసుకున్నారని.. ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. గురువారం నాడు కొత్త పార్లమెంట్ భవనం వద్ద తనతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాసేపు మాట్లాడారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడి గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏయే విషయాలను ప్రస్తావించారో ఆ విషయాలను ఆయన ట్వీట్ చేశారు.
MP Keshineni Nani Tweet: టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్ ప్రకారం..''ఇవాళ పార్లమెంటు వద్ద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కలిశారు. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడు. ఆయన (చంద్రబాబు) ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదు. చంద్రబాబు మచ్చ లేని ప్రజా సేవకుడు. కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటపడతారు.'' అని గడ్కరీ తనతో అన్నారని నాని వెల్లడించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చంద్రబాబు నాయుడి ప్రజాసేవ గురించి ప్రస్తావించిన మాటలు టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించాయి.