Union Minister Bharati Pravin Pawar : నాసిరకం మద్యానికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది : కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ - పండిట్ దీన్‌దయాల్ జయంతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2023, 11:34 AM IST
Union Minister Bharati Pravin Pawar : నాసిరకం మద్యం తాగడం వల్ల ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటే వాటికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని.. కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. మద్య నియంత్రణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పారు. దీంతో కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు. నాణ్యత లేని మద్యం తీసుకోవడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులతో బాధితులు ఆసుపత్రుల పాలవుతున్నారని.. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. ఏ రాష్ట్రంలోనైనా నాసిరకం మద్యం తాగి ప్రజలు మరణిస్తే.. విచారణ చేసి అలాంటి వాటిని నివారించాలి అని తెలిపారు. అయితే కొన్ని రాష్ట్రాలు అలా చేయకపోవడం బాధాకరం అని వ్యాఖ్యానించారు. ఏపీలో ఆ విధంగా జరుగుతుంటే మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వం దానిపై దృష్టి సారించాలి. మద్యం సేవించడం వల్ల మరణాలు సంభవిస్తే.. ప్రభుత్వం చర్యలు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అన్నారు.
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పండిట్ దీన్‌దయాల్ జయంతి కార్యక్రమంలో.. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి ఆమె పాల్గొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తాగునీటి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంతో సమీక్షించి త్వరలోనే పరిష్కారానికి చొరవ చూపుతానని చెప్పారు. అవయవదానం, రక్తదానాలకు ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.