ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు - ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న తల్లీకుమార్తె - petrol in doors of a house
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2023, 8:14 PM IST
|Updated : Nov 14, 2023, 10:13 PM IST
Unidentified People Pour Petrol on House and Set it on Fire: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావు పాలెం గ్రామంలో ఒక ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ ఇంట్లో ఇద్దరు మహిళలు నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున కావడంతో వెంటనే మేల్కొన్నారు. మంటలు ఇంటి లోపలకు వ్యాపించడంతో మేల్కొన్న ఇద్దరు మహిళలూ.. వెంటనే పోలీసులకు కాల్ చేసి సమాచారం ఇచ్చారు . ఆ మంటలను చూసి తల్లి, కుమార్తె భయాందోళనకు గురైయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మంటలను ఆర్పి ఇద్దరు మహిళల ప్రాణాలను కాపాడారు.
సమయానికి పోలీసులు వచ్చి రక్షించడం వల్ల ఇద్దరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. కొంతకాలంగా అంగడి విషయంలో వారి బంధువులతో వివాదాలు జరుగుతుండటం వల్ల వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని బాధితురాలు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.