హాల్ టికెట్లు డౌన్‌లోడ్ కాకపోవడంపై నిరుద్యోగుల ఆందోళన స్పందించని అధికారులు - ap ప్రధాన వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 29, 2023, 10:02 AM IST
Unemployes Worried Hall Tickets Not Downloaded: పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్‌లోడ్ కాకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1896పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 11న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో సుమారు 700 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు డౌన్లోడ్ కావడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పశుసంవర్థక శాఖ అధికారులను కలిస్తే ఎటువంటి స్పందన లేదని వాపోయారు.
డిసెంబర్ 31న తమకు పరీక్ష నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. 27 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. వెబ్సైట్లో ఇచ్చిన లింకుతో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ కావటం లేదని కార్యాలయాంలో అడిగితే మీకు మెయిల్ ద్వారాా సమాచారం అందించామంటున్నారు. కానీ తమకు ఎటువంటి సమాచారం రాలేదు అని నిరుద్యోగులు చెబుతున్నారు. అధికారులు స్పందించి తమకు తక్షణమే హాల్ టికెట్లు ఇవ్వాలని లేకపోతే ఈ ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని నిరుద్యోగులు హెచ్చరించారు.