మెగా డీఎస్సీ ప్రకటించకుంటే వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం: నిరుద్యోగులు - మెగా డీఎస్సీ డిమాండ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 7:51 PM IST
Unemployees Protest for Mega DSC at Kurnool Collectorate: మెగా డీఎస్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని నిరుద్యోగ యువత మండిపడ్డారు. ముస్సోలి, హిట్లర్ పరిపాలన కన్నా అధ్వానమైన పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగు సంవత్సరాలుగా నోటిఫికేషన్ విడుదల చేస్తారని స్టడీ సెంటర్లలో ఉంటూ సన్నద్ధం అవుతున్నామని విద్యార్థులు ఆవేదన వెలిబుచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. నోటిఫికేషన్ ఇవ్వని పక్షంలో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు నిరుద్యోగులంతా ఏకమవుతారని స్పష్టం చేశారు. తెలంగాణలో నిరుద్యోగులు ఏకమై అధికార మార్పిడి చేసినట్లే ఆంధ్రప్రదేశ్లోనూ వచ్చే ఎన్నికల్లో అధికార మార్పిడికి పాటు పడుతామని నిరుద్యోగులు స్పష్టం చేశారు. మెగా డీఎస్సీని విడుదల చేయకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.