Record: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో రెండేళ్ల బాలుడు.. ఏం చేశాడో తెలుసా! - నంద్యాల జిల్లాలో రెండేళ్ల బాలుడి అరుదైన రికార్డ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 23, 2023, 10:44 AM IST

Updated : Apr 23, 2023, 3:13 PM IST

నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ చెందిన రెండేళ్ల బాలుడు ఓ అరుదైన రికార్డు సాధించాడు. రెండేళ్ల పిల్లాడు మోక్ష అయాన్‌.. జంతువులు, సంఖ్యలు, పక్షులు, జాతీయ నాయకులను గుర్తించి వారి పేర్లను చెబుతూ.. ప్రతిభ కనబరుస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్​కు చెందిన స్వప్నక దంపతుల రెండు సంవత్సరాల పిల్లాడు.. ఈ ప్రతిభ చూపి అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. జంతువులు, నంబర్లు, జాతీయ నాయకులు, వాహనాల పేర్లు ఆంగ్లంలో చెబుతున్నాడు. వీటిని ఎప్పటికప్పుడు రికార్డు చేసిన బాలుడి తల్లి స్వప్నక.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్​కు అప్లై చేసింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌ వారు పరిశీలించి.. ఆ బాలుడిని ఎంపిక చేసి.. బాలుడి ప్రతిభ ఆధారంగా ఓ ధ్రువపత్రం, పతకాన్ని పంపించారు.. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మా బాబు ఈ విధంగా ప్రతిభ కనపర్చడం.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Last Updated : Apr 23, 2023, 3:13 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.