Two Volunteers Arrested in Liquor Case: మహా ముదుర్లు.. కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వాలంటీర్లు అరెస్ట్ - అన్నమయ్య జిల్లాలో ఇద్దరు వాలంటీర్లను అరెస్ట్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 8:36 PM IST
Two Volunteers Arrested in Liquor Case: అక్రమంగా కర్ణాటక మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్న వాలంటీర్లు అరెస్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ప్రజలకు సేవలు అందించకుండా చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడుతున్నారు. అన్నమయ్య జిల్లా కురవకోట మండలం అంగళ్లుకు చెందిన ఇద్దరు వాలంటీర్లు కర్ణాటక మద్యం విక్రయిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో ఒకరు మహిళా వాలంటీర్ ఉన్నారు. వీరిపై ఎక్సైజ్ సీఐ శ్రీహరి రెడ్డి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు.
అంగళ్లు గ్రామ పంచాయతీ పాతట్యాంకు వీధిలో సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయించడంతో పాటు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 480 టెట్రా మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం రాయలపాడుకు చెందిన ఆర్ఎస్. నడిపి రెడ్డితో పాటు అంగళ్లు గ్రామానికి చెందిన వాలంటీర్ సందీప్, అలాగే ఇదే గ్రామానికి చెందిన వాలంటీర్ అమ్మాజీలను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.