రెండు ఆర్టీసీ బస్సులు ఢీ - తప్పిన పెను ప్రమాదం - Two buses collided news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-12-2023/640-480-20373852-thumbnail-16x9-two-rtc-buses-collided-in-paderu-ghat-road.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 1:30 PM IST
Two RTC Buses Collided in Paderu Ghat Road : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఆర్టీసీ సిబ్బంది స్వల్ప గాయలతో బయటపడ్డారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణానష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. గురువారం ఉదయం అనకాపల్లి నుంచి పాడేరు వచ్చే బస్సు, అలాగే పాడేరు నుంచి వైజాగ్ వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ ప్రమాదానికి గురయ్యాయి. పాడేరు ఘాట్ రోడ్డులోని సమీప మలుపులో రెండు బస్సులు ఓకేసారి ఎదురుపడంతో ఈ ప్రమాదం సంభవించింది.
Road Accident in Alluri District : దీంతో బస్సుల ముందు భాగాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘాట్ రోడ్డుకి ఇరువైపులా లోయలు ఉన్నాయి. బస్సులు అదుపుతప్పి లోయలో పడిఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని ప్రయాణికులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డుపై భారీగా వాహనాలు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఎదురుచూస్తున్నారు.