ETV Bharat / state

పోలీసు, న్యాయ వ్యవస్థల సమన్వయంతో చాలా కేసులు ఛేదించవచ్చు: మంత్రి అనిత - ANITHA ON PROSECUTION AWARENESS

విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు - సదస్సులో పాల్గొని కీలకమైన అంశాల గురించి మాట్లాడిన మంత్రి అనిత

ANITHA_ON_PROSECUTION_AWARENESS
ANITHA_ON_PROSECUTION_AWARENESS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2025, 3:53 PM IST

Minister Anitha Comments at Prosecution Awareness: సైబర్‌ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని హోంమంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరమని అన్నారు. విజయవాడలో ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి న్యాయవిచారణలో కీలకమైన సాంకేతిక ఆధారాల పాత్రపై మాట్లాడారు. న్యాయవాదులందరినీ ఒక చోట చేర్చి ఇలాంటి సదస్సు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. న్యాయవ్యవస్థల్లో మహిళలు ఎక్కువ ఉండడం శుభపరిణామమని వివరించారు.

పోలీస్, లాయర్ వృత్తిలోకి రావడం గొప్ప విషయమని మంత్రి అన్నారు. ఎక్కడబడితే అక్కడ సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని దొంగలు ఇప్పుడు చాలా తెలివిమీరి పోయారని అన్నారు. నేరస్థులను పట్టుకోవడానికి మనం చాలా అప్​గ్రేడ్ అవ్వాలని మంత్రి సూచించారు. సాంకేతికతని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలని అన్నారు. పోలీసు, న్యాయ వ్యవస్థల సమన్వయంతో చాలా కేసులు ఛేదించొచ్చని మంత్రి తెలిపారు. సమాజానికి ధైర్యమిచ్చే వారు పోలీసులు, ప్రజలకు న్యాయం చేసే వారు న్యాయవాదులని మంత్రి కొనియాడారు. ఎంతటివారైనా కోర్టుకు వస్తే చేతులు కట్టుకుని నిల్చునేంతటి గౌరవం న్యాయ వ్యవస్థకు ఉందని తెలిపారు.

బర్డ్​ఫ్లూ మనుషులకు సోకిందనేది వదంతులే: ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

న్యాయవ్యవస్థకు అవసరమైన వనరులు, వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి స్వయంగా తనకు తాను నిఘా పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. దొంగతనాలు, నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరమని తెలిపారు. ప్రోటోకాల్ లేకుండా ట్రాఫిక్​లో ప్రయాణించి ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశానని తెలిపారు. టెక్నాలజీ ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గించడం సులభమని తెలిపారు. ఫాస్ట్​ట్రాక్, ప్రత్యేక కోర్టులు, పోస్కో కోర్టులు ఎన్నో ఉన్నాయని తెలిపారు.

"బాధితులకు అండగా నిలవడానికి మనమందరం ఏకమవుదాం. చిన్న చిన్న ఇబ్బందులతో చేయాల్సిన మంచి పని చేయకుండా ఎవరూ ఎక్కడ ఆగిపోకూడదు. కోటు వేసుకుని కోర్టులోకి వెళ్లారంటే మీ పేరు కాదు మీ పని కనబడాలి. మీది వృత్తి కాదు అది ఒక సామాజిక బాధ్యత. జీవితంలో ఏదో కోల్పోయి మీదగ్గరకి వచ్చిన వారిని అక్కున చేర్చుకోవాలి. సమాజ గౌరవం, ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలి. నేరం రుజువైతే బెయిల్ రాకముందే శిక్షపడే స్థాయిలో పని చేయాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందరమూ ముందుకుసాగుదాం".- అనిత, హోంమంత్రి

అరాచకాలకు కేరాఫ్​ అడ్రస్​గా వంశీ - అక్రమాల్లో 'సిక్స'ర్ గ్యాంగ్ తోడు

అంతా నా ఇష్టం 'ఏపీఎండీసీలో' పెద్దిరెడ్డి తీరు - పనిలేకపోయినా 370 మందికి జాబ్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.