CM Chandrababu at Sant SevaLal Jayanti: బ్రిటీష్ కాలంలో మతమార్పిడులపై సంత్ సేవాలాల్ పోరాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. సంఘసంస్కర్త, గిరిజనుల, బంజారాల ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు అయిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అహింసావాదానికి, మూఢ నమ్మకాలను పారద్రోలడానికి సేవాలాల్ మహారాజ్ చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Gummadi Sandhya Rani), గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ కంటే ముందే అహింస పాటించారు: సంత్ సేవాలాల్ అహింసా సిద్ధాంతం బోధించారన్నారు. మహాత్మాగాంధీ కంటే ముందే సంత్ సేవాలాల్ అహింసా సిద్ధాంతాలను పాటించారని తెలిపారు. గిరిజనుల్లోని వెనుకబాటును తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సంత్ సేవాలాల్ మార్గంలో ప్రయాణిస్తే అందరికి మేలు జరుగుతుందని సీఎం తెలిపారు.
సంఘసంస్కర్త, గిరిజనుల, బంజారాల ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు అయిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాను. అహింసావాదానికి, మూఢ నమ్మకాలను పారదోలడానికి సేవాలాల్ మహారాజ్ చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నాను. pic.twitter.com/ykndVE9gl7
— N Chandrababu Naidu (@ncbn) February 15, 2025
ఇప్పటి ఆర్థిక విధానాలను అప్పుడే బోధించారు: వెల్తీ, హెల్తీ, హ్యాపీ అనే సిద్ధాంతాలతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు. తండాల నుంచి ఎంతో మందిని రాజకీయంగా ప్రోత్సహించామని గుర్తు చేశారు. సంత్ సేవాలాల్ ఏపీలో పుట్టినా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ సేవ చేశారని అన్నారు. ఈనాడు మనం ఆచరిస్తున్న ఆర్థిక విధానాలను ఆయన అప్పుడే బోధించారని కొనియాడారు.
సంత్ సేవాలాల్ ఆశయాల సాధనకు చేస్తాం: సంత్ సేవాలాల్ మార్గంలో ప్రయాణిస్తే అందరికీ మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అందరి మనోభావాలను కాపాడుతూనే కూటమి సర్కారు పని చేస్తుందని స్పష్టం చేశారు. పేదలు, ప్రత్యేకంగా గిరిజనులకు సేవ చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందని గుర్తు చేసుకున్నారు. గిరిజనుల్లో నిరుపేదలు ఎక్కువగా ఉంటారన్న సీఎం, గిరిజనుల్లోని వెనుకబాటును తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసానిచ్చారు. గిరిజన చట్టాలను కూటమి ప్రభుత్వం కాపాడుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉగాది నుంచి పీ4 పద్దతికి శ్రీకారం చుట్టబోతున్నామని, సంత్ సేవాలాల్ ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
క్రిమిసంహారక మందులు వాడిన ఆహారం తినాల్సి వస్తుంది: సీఎం చంద్రబాబు