అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసిన పోలీసులు - west godavari district ganjai news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 3:54 PM IST

Two Persons Transporting Ganjai Arrested by City Police:  మత్తు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఇద్దరు యువకులు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గంజాయి తరలిస్తున్న యువకులను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై కె.సుధాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్ , డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ ఆదేశాలతో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎస్.వి.నాగరాజుకి వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఎస్సై సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణ శివారు ప్రాంతంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఇద్దరు యువకులు గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న షేక్ అక్బర్, ఓరుగంటి షాలేం రాజు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. మత్తు, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని తమ జీవితాలను సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఆయన వెంట ఎస్సై జీజే ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ జి.శ్రీను, కానిస్టేబుల్స్ సి.శ్రీనివాసరావు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.