జగనన్న మీద నమ్మకంతో గుంతలో లారీలు దింపారు - అంతే గంటల తరబడి అవస్థలు!
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 2:11 PM IST
Two Lorries Stuck In Dolapeta Road Ditch : అసలే అంతంత మాత్రం రోడ్లు. ఆపై గోతులు, అందులో ఏమైనా పెద్ద వాహనాలు నిలిచి పోతే జనానికి చుక్కలు కనిపించడం ఖాయం. రాజాం - పాలకొండ రహదారి అంత ఘోరంగా తయారవ్వడంతో రెండు ఇసుక లారీలు కూరుకుపోయాయి. రోడ్డుపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కంబాల జోగులు అక్కడికి వచ్చారు. ఈ రహదారిని మెటల్‌తో పూడ్చితే తప్ప సమస్య పరిష్కారం కాదని స్థానికులు చెప్పారు. కాదంటే చెప్పండి తామే మెటల్ వేసుకుంటామని ఎమ్మెల్యేకు స్థానికులు తేల్చి చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Road Situation in AP under Cm Jagan Ruling : విజయనగరం జిల్లా రాజాం ప్రధాన రహదారి డోలపేట వద్ద గుంతల్లో రెండు ఇసుక లారీలు కూరుకుపోయాయి. బుధవారం సాయంత్రం ఘటన జరగ్గా.. రాత్రి లారీలను బయటికి తీయకపోవడంతో రాకపోకలు స్తంభించాయి. కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఆగిపోయి వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. డోలపేట వద్ద పరిస్థితిని పరిశీలించడానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులును.. రోడ్డు సమస్యపై ప్రజలు గట్టిగా నిలదీశారు. పెద్ద పెద్ద గోతులు ఏర్పడినా పూడ్చకపోవడమేంటని ప్రశ్నించారు. మీరు చేయనంటే మేమే రోడ్డును బాగు చేసుకుంటామని ఎమ్మెల్యేకి స్పష్టం చేశారు. ప్రజల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఎమ్మెల్యే జోగులు.. బైక్‌పై మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Vizianagaram Road Situation : క్రేన్ సాయంతో లారీలను బయటకు తీయించేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. రోడ్డుపై కూరుకుపోయిన ఇసుక లారీలను కొన్ని గంటల తర్వాత ఎట్టకేలకు రాత్రికి బయటికి తీశారు. తాత్కాలికంగా సమస్య తీరిందని ఊపిరి పీల్చుకున్న కొద్దిసేపటికే... అక్కడి గుంతల్లో చెరుకు లారీ బోల్తా పడింది. దీనివల్ల మళ్లీ ట్రాఫిక్ సమస్య తలెత్తి... వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. రహదారిని ఎప్పుడు బాగు చేస్తారని R&B జేఈ నాగభూషణంను ప్రజలు ప్రశ్నించగా.. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల రోడ్డు విస్తరణ పనులు మధ్యలో నిలిపివేశారని తెలిపారు.