TTD Board Meeting వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ బోర్డు సమావేశం.. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు - వైవీ సబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ బోర్డు సమావేశం
🎬 Watch Now: Feature Video
TTD Board Meeting: పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య పరికరాలు కొనుగోలుకు 76 కోట్లు నిధులు మంజూరు చేస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య భవన్‌లో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన ధర్మకర్తల మండలి.. రెండు ఘాట్ రోడ్డుల్లో ప్రమాదాల నివారణకు.. 24 కోట్ల రూపాయలతో రక్షణ గోడలను నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. అలిపిరి నడకమార్గంలో భక్తుల సౌకర్యార్థం నరసింహ ఆలయం నుంచి మోకాలి పర్వతం వరకు 4 కోట్లతో.. పూర్తిస్థాయిలో షెడ్ల పైకప్పు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల ఔటర్ రింగు రోడ్డు.. ధర్మరథ విద్యుత్ బస్సు, ఆర్టీసీ విద్యుత్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్ కోసం.. 2.60 కోట్లు మంజూరు చేశారు. పద్మావతి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్ నిర్మాణం కోసం.. 23.50 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. అన్నప్రసాదం తయారీలో.. నాణ్యతను పరీక్షించే ఆధునిక యాంత్రాలు కొనుగోలు చేసి 4.50 కోట్లతో లాబ్ నిర్మాణం చేపడతామన్నారు. శ్రీనివాస మంగాపురంలో 3.10 కోట్లతో పార్కింగ్ స్థలం, మినీ కళ్యాణకట్ట నిర్మాణానికి ఆమోదం తెలిపారు.