Trees Cutting for CM Meeting: సీఎం వస్తున్నారంటా.. చెట్లు నరికేశారు.. భారీకేడ్లు ఏర్పాటు చేశారు., - cm jagan meeting arrangements
🎬 Watch Now: Feature Video
Tree Branches Cutting for CM Meeting: సీఎం జగన్ సభల నిర్వహాణలో.. చెట్ల నరికివేత కొనసాగుతోంది. తాజాగా .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే మార్గం గుండా వెళ్లే రోడ్డుకు.. ఇరువైపులా ఉన్న చెట్లను, చెట్ల కొమ్మలను నరికివేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంకు ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి రానున్నారు. జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో గల పాలిటెక్నిక్ కళాశాల వద్ద హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. ఆ హెలిప్యాడ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కురుపాంలోని సెయింట్ మోంట్‌ఫోర్ట్ స్కూల్ సమీపంలోని మైదానంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశలో ముఖ్యమంత్రి అమ్మఒడి సాయం నిధులను విడుదల చేస్తారు. చినమేరంగి నుంచి కురుపాం వరకు సీఎం రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించనున్నారు. అయితే చినమేరంగి నుంచి కురుపాం వరకు గల 3 కిలో మీటర్ల వరకు సీఎం వెళ్లనున్న మార్గంలో రోడ్డుకు ఇరువైపులా చెట్ల కొమ్మలను తొలగించారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా ముఖ్యమంత్రి ప్రయాణించి దారికి ఇరువైపులా బారీకేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉందని.. అందుకోసం చెట్ల కొమ్మలను తొలగించినట్లు వివరించారు. గత కొన్ని రోజులుగా జిల్లా అధికారులు, నాయకులు సభ స్థలం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.
TAGGED:
Branches Cutting for CM Meet