Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి - road accidents in ap
🎬 Watch Now: Feature Video
Today Raod Accident in Annamayya: తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరి ప్రదర్శనకు తుఫాను వాహనంలో వెళుతున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు భక్తులు గాయపడ్డారు. ఈ ఘటన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఈ ఉదయం చోటుచేసుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన 12 మంది భక్తులు తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చిత్తూరు-కడప ప్రధాన రహదారిలోని అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణానికి అతి సమీపంలో కల్లూరు మండల సరిహద్దులో ఆగివున్న లారీని తుపాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నంద్యాలకు చెందిన విమల, శివమ్మ, లక్ష్మీదేవి, ప్రతాపరెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. నంద్యాల టౌన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగమణి, రమేష్, రామ తులసమ్మ, ధనస్సు తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.