PRATHIDWANI : ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల నుంచి.. యువత తప్పించుకునేదేలా?
🎬 Watch Now: Feature Video
ఉద్యోగాల ఆశ చూపిస్తూ యువతను నిలువునా ముంచేస్తున్న మోసగాళ్లు. ఉత్తుత్తి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒక అడుగు ముందుకేసి క్యాంపస్ ఎంపికలు చేస్తున్నారు. ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్స్‌తో నమ్మిస్తూ.. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల వల విసురుతున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం నిరుద్యోగ యువతను ఉచ్చులోకి లాగుతున్న నేరగాళ్లు.. అడ్వాన్స్‌గా కొంత డబ్బిస్తే కోరుకున్న ఉద్యోగమంటూ ఆశచూపిస్తున్నారు. తొందరపడి వీళ్ల గాలానికి చిక్కిన యువత లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఉద్యోగాలు తక్కువై.. నిరుద్యోగులు ఎక్కువైతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. యువత ఈ మోసాల భారీ నుంచి తప్పించుకునేదేలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST