తుపాను బాధితులకు సాయం ఏదీ? - బియ్యం ఇచ్చి చేతులు దులుపుకున్న జగన్ : టీడీపీ - నరసింహ యాదవ్‌ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 12:31 PM IST

Tirupati District Telugu Desam Party President Comments on Jagan : వరదలో చిక్కుకున్న పేదలకు ఇంటికి  రెండు వేల ఐదు వందలు చొప్పున సాయం చేస్తామని తిరుపతి జిల్లా పర్యటనలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేవలం బియ్యం పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని తిరుపతి జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు (Telugu Desam Party District  President) నరసింహ యాదవ్‌ మండిపడ్డారు. ఓజిలి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందానికి (central Team) ఆయన వినతిపత్రం అందజేశారు. వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

Tirupati District TDP President Fires On YSRCP : వరదలో చిక్కుకున్న పేదలకు కేవలం చంద్రబాబు నాయుడు రైతులను పరామర్శిస్తున్నారనే  సీఎం జగన్​ ప్రజలను కలవాలనుకున్నారని నరసింహ యాదవ్​ ఆరోపించారు. అయినప్పటికీ బాధిత  అన్నదాతలను నేరుగా కలవలేకపోయారని అన్నారు. కారులో కూర్చునే పలకరించారని మండిపడ్డారు. ​ తుపాను కారణంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని నరసింహ యాదవ్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.