Tirupathi Police Seized 10 Kgs Ganja : 10 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ - తిరుపతి వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 9:36 AM IST
Tirupathi Police Seized 10 Kgs Ganja : రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణా పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో గంజాయి పట్టుబడుతూనే ఉంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు ఆగడం లేదు. ఏదో ఒక విధంగా అక్రమంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తరలిస్తున్నారు. కానీ చివరకు ఎక్కడో ఒక చోట పట్టుబడుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో 10 కేజీల గంజాయి పోలీసులకు పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై సెబ్ అధికారులు వాహనాల తనిఖీల్లో పది కిలోల 500 గ్రాముల గంజాయిని, ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకున్నారు. వీరు ప్రైవేటు బస్సులో విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరుకు చెందిన వీరు పలువురితో కలిసి గంజాయి అమ్ముతున్నారని, రెండో సారి గంజాయి తరలిస్తూ పట్టుపడినట్లుగా సెబ్ సీఐ ప్రసాద్ పేర్కొన్నారు. మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు.