Tirumala Srivari Hundi Fell Down: తిరుమల ఆలయంలో అపశృతి.. కిందపడిన శ్రీవారి హుండీ.. - తిరుపతి జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-07-2023/640-480-18927715-715-18927715-1688630129732.jpg)
Tirumala Srivari Hundi Fell Down: తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద స్వామివారి హుండీని ట్రాలీని తోసుకుంటూ వస్తుండగా పొరపాటున కిందకు పడిపోయింది. ఆలయం నుంచి రోజువారీగా హుండీలు పరకామణికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కాసేపు మహాద్వారం వద్ద దర్శనానికి వెళ్లే భక్తులను అధికారులు నిలిపివేశారు. హుండీలో నుంచి కిందకు పడిపోయిన కానుకులను టీటీడీ అధికారులు తిరిగి హుండీలోకి వేశారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ మహాద్వారం వద్ద ట్రాలీని తోసుకుని వస్తుండగా గట్టుకు తగులుకుందని, దానిని సిబ్బంది నియంత్రించలేకపోవటం వల్ల ఈ ఘటన జరిగిందని తెలిపారు. కాగా తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు ఆలయ అధికారులు 18 గంటల అనుమతినిచ్చారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకునేందుకు 77,299 మంది భక్తులు తరలివచ్చారు. వారిలో 30,479 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు.