Tirumala Brahmotsavam Arrangements: ఈ నెల 18 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ - SP inspected Tirumala Brahmotsavam arrangements
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2023, 10:57 AM IST
Tirumala Brahmotsavam Arrangements Inspected by Tirupati District SP Parameswara Reddy : తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) భద్రత అధికారి నరసింహ కిషోర్ పరిశీలించారు. ఈ నెల 18న (Tirumala Brahmotsavam Starts From September 18th) మొదలయ్యే బ్రహ్మోత్సవాలకు పోలీస్ శాఖ నుంచి అన్ని చర్యలు తీసుకుందని ఎస్పీ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, భక్తులు వాహన సేవలను తిలకించేందుకు గ్యాలరీలోకి వెళ్లే మార్గాలను తిరిగి రావడానికి వచ్చే మార్గాలను పర్యవేక్షించామని ఆయన అన్నారు. గరుడ సేవ రోజున తిరుమలకు వచ్చే వాహనాలు పార్కింగ్ చేసుకునే స్థలాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల నుంచి భద్రత ఫోర్స్ రావడం జరుగుతుందని తెలిపారు. టీటీడీ విజిలెన్స్, పోలీస్ శాఖ సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేస్తామని ఎస్పీ పరమేశ్వర రెడ్డి చెప్పారు. తిరుమల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 26 వ తేది వరకూ జరగనున్న నేపథ్యంలో టీటీడీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.