టీడీపీ నేత నల్లమిల్లి ఇంటి వద్ద దుండగులు హల్‌చల్‌ - అనపర్తి పీఎస్‌లో ఫిర్యాదు - TDP leader Nallamilli comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 7:43 PM IST

Thugs Halchal at TDP Leader Nallamilli Ramakrishna Reddy Home: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద కొంతమంది దుండగులు హల్‌చల్‌ చేశారు. తెల్లవారుజామున కారులో ఇంటి వద్దకు విచ్చేసి.. హారన్లు మోగిస్తూ భయాందోళనకు గురి చేశారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. అనపర్తి పోలీస్ స్టేషన్‌లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు.

Nallamilli Ramakrishna Reddy Comments: ''గురువారం తెల్లవారుజామున మా ఇంటి వద్ద కొంతమంది దుండగులు కారులో వచ్చి హారన్లు మోగిస్తూ హల్‌చల్ చేశారు. మా ఇంట్లో వంట చేసే మనిషిని పిలిచి, నా గురించి అడగ్గా ఆమె పడుకున్నారని సమాధానం ఇచ్చింది. దాంతో వారు ఆమెతో ఇబ్బందికరంగా ప్రవర్తించడంతో భయపడి తలుపులు మూసి, లోపలికి వచ్చింది. సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఎవరనేది సరిగ్గా తెలియలేదు. గత నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో అనేక చోట్ల నాపై భౌతికంగా దాడి చేసేందుకు ప్రయత్నించారు. రెండు సందర్భాల్లో నా ఇంటిపై దాడి చేసేందుకు కొంతమంది వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఇప్పుడు నా ఇంటి వద్దకు వచ్చి నా గురించి ఆరా తీశారు. నాకు ప్రాణహాని ఉందని గతంలోనే ఎస్పీకి ఫిర్యాదు చేశాను. కానీ, ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు'' అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.