ఇంటి వద్దే కాచుకున్న మృత్యువు - మూడేళ్ల బాలుడిని మింగేసిన విద్యుత్ స్తంభం - కరెంటు షాకుతో చిన్నారి మృతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 10:21 AM IST
|Updated : Nov 6, 2023, 12:11 PM IST
Three Years Baby Died in Anantapur District : మూడేళ్ల చిన్నారి విద్యుదాఘాతంతో మరణించిన హృదయవిదారక ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. మూడేళ్ల తమ కుమారుడికి అప్పుడే వందేళ్లు నిండిపోయాయని తల్లిదండ్రులు, బంధువులు రోధిస్తున్నారు. కడుపు కోతతో కన్నతల్లి బోరున విలపించింది. చిన్నారి మృతదేహం వద్ద తన తండ్రి భీమా నిస్సహాయ స్థితిలో కూర్చుని రోధిస్తున్నారు.
Baby Died With Electric Shock : గుంతకల్లు మండలం దంచర్ల గ్రామంలో భీమ, మౌనిక దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి మూడేళ్ల బాలుడు ఉన్నాడు. ఇంటి పరిసరాలలో ఆడుకుంటున్న బాబు ఆవరణలోని ఇనుప విద్యుత్ స్తంభాన్ని తాకాడు. దీంతో విద్యుదాఘాతంతో అపస్మారకస్థితోలకి వెళ్లాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన సిద్ధార్థను చికిత్స నిమిత్తం గుంతకల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసువెళ్లారు. బాబును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుడి మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.