Thefts to Using MLA sticker: "నేను మంత్రి తమ్ముడిని.. డబ్బులు ఇస్తావా.. నీ అంతు చూడమంటావా?" - ap news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2023, 10:21 PM IST
|Updated : Aug 27, 2023, 6:39 AM IST
Thefts to Using MLA Sticker : సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తమ్ముడిని అని చెప్పుకుంటూ దౌర్జన్యాలకి పాల్పడుతున్న దొంగల శ్రీధర్ అనే వ్యక్తిని హనుమాన్ జంక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా తేలప్రోలు గ్రామానికి చెందిన తొందూరు శామ్యూల్.. హనుమాన్ జంక్షన్‌లోని కాకానిబాబు సంతలో పశువుల వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలం క్రితం దొంగల శ్రీధర్ అనే వ్యక్తి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తమ్ముడిని అని శామ్యుల్‌కి పరిచయం అయ్యాడు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ (Cattle Business with MLA Sticker on Car ) వేసుకుని పశువుల వ్యాపారం చేద్దాం అని నమ్మించి మోసపూరితంగా శామ్యుల్ నుంచి పది వేల రూపాయలు తీసుకున్నాడు. తరచూ వచ్చి డబ్బులు అడుగుతుండటంతో శామ్యుల్ నిరాకరించాడు. ఈ నెల 25న వేలేరు వద్ద శామ్యుల్ని అడ్డగించిన శ్రీధర్.. మినిష్టర్ తమ్ముడిని అని చెప్పినా డబ్బు ఇవ్వడం లేదు. నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. శామ్యుల్ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. శ్రీధర్‌ను రిమాండ్ నిమ్మితం నూజివీడు కోర్ట్‌లో హాజరు పరిచారు. అతనిపై గతంలోను పలు రకాల కేసులు, కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉన్నట్లు గుర్తించారు.