Coconut farmers protest కలెక్టరేట్ ఎదుట కొొబ్బరి రైతుల నిరసన.. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ - eluru today news
🎬 Watch Now: Feature Video
The coconut farmers protested in front of the Collectorate : ఏలూరులో ఎండిన కొబ్బరికాయలు కొనుగోలు చేయక మెులకలు వస్తున్నాయని కొబ్బరి రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కొబ్బరి రైతుల సంఘం ఆధ్వర్యంలో కొబ్బరికాయలను రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. కొబ్బరి రైతులను ఆదుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. కొబ్బరి కొనుగోలు కేంద్రాలను తెరవాలని, గిట్టుబాటు ధరను కల్పించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేత నిమ్మగడ్డ నర్సింహా మాట్లాడుతూ.. కొబ్బరి రైతుల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదన్నారు. కొబ్బరి చెట్ల నుండి రాలిన కాయలు గుట్టగా పోయడానికి అయ్యే ఖర్చులు కూడా రావటం లేదు. దీంతో కాయలను తోటల్లోనే ఉంచటం వల్ల మొలకలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులకు కొబ్బరికాయకు ఐదు నుంచి ఆరు రూపాయలు మాత్రమే వస్తోందన్నారు. వినియోగదారులకు మాత్రం నాణ్యమైన కొబ్బరికాయను రూ.30 పైగా అమ్ముతున్నారని అన్నారు. . కొబ్బరికాయలకు కనీస ధర రాకపోటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంటలకు సరైన ధరలు రాని సమయంలో ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింప చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా ఆచరణలో అమలు కావటం లేదని విమర్శించారు. సంవత్సరానికి ఎకరా కొబ్బరి సాగుకు రూ. 40 వేలు ఖర్చు అవుతుంది. కనీస పెట్టుబడులు రాక నష్టాల్లో కూరుకపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.