Kodikatti case: నిందితునికి, తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధం లేదు: న్యాయవాది సలీం - Andhra Pradesh top news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 13, 2023, 6:39 PM IST

Kodikatti case latest updates: విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్‌పై జరిగిన కోడికత్తి ఘటనకు సంబంధించి.. విజయవాడలో ఉన్న ఎన్‌ఐఏ కోర్టు నేడు కీలక విషయాలను వెల్లడించింది. నిందితుడికి ఏ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు కూడా ఈ ఘటనతో సంబంధం లేదని ఎన్‌ఐఏ వెల్లడించింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని పేర్కొంది. జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని కోర్టు కోరింది. అయితే, వాదనలకు సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరడంతో.. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కోడికత్తి కేసులో నిందితునికి తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధం లేదని.. నిందితుడి (శ్రీను) తరఫు న్యాయవాది సలీం తేల్చి చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ఇదే విషయంపై కౌంటర్‌ దాఖలు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే సీఎం జగన్ రెండు పిటీషన్లు వేశారని.. అందులో తదుపరి విచారణ కోసం ఒక పిటీషన్, తాను (జగన్) వస్తే విజయవాడలో భారీ ట్రాఫిక్ జామ్ అవుతుందని, విచారణకు సంబంధించి తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యాన్ని నమోదు చేసే అవకాశం ఇవ్వాలంటూ రెండవ పిటీషన్ వేశారన్నారు. ఈ క్రమంలో ఈరోజు జరిగిన విచారణలో జగన్ తదుపరి విచారణ పిటీషన్‌పై ఎన్‌ఐఎలు వాళ్లు కౌంటర్ వేయగా.. తాను కూడా కౌంటర్ వేశానని నిందితుడి తరఫు న్యాయవాది సలీం తెలిపారు. చివరికి ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలన్న సీఎం జగన్‌ పిటీషన్‌ను కొట్టివేయాలని ఎన్‌ఐఏ కోర్టును కోరిందని ఆయన వివరాలను వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.