ఆడుదాం ఆంధ్ర కాదు - అడుగుదాం ఆంధ్ర 'జాబ్​ క్యాలెండర్ ఏది జగన్?' - youth criticized the YCP government in Guntur

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 6:54 PM IST

Telugu Youth Protested Against the YCP Government : రాష్ట్రంలో జరుగుతున్నది ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం కాదని యువత జీవితాలతో ప్రభుత్వం ఆడుతోందని యువజన విద్యార్థి సంఘాలు విమర్శించాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గుంటూరులో తెలుగు యువత, జనసేన యువజన విభాగం, ఎ.ఐ.ఎస్.ఎఫ్, ఏ.ఐ.వై.ఎఫ్, N.S.U.I నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. "అడుగుదాం ఆంధ్రా- ఇది ఉద్యోగాల వేట- నిరుద్యోగుల మాట" పేరుతో గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లో కబడ్డీ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక అల్లాడుతున్న నిరుద్యోగులను పట్టించుకోకుండా ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో విద్యార్థులను ఆడుకుంటున్నారని యువజన విద్యార్థి సంఘాలు నాయకులు ఎద్దేవా చేశారు. 

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎన్నికల డ్రామాగా అభివర్ణించారు. జాబు క్యాలెండర్ పేరిట నాటకాలు ఆపి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు యువతకు కావాల్సింది ఉద్యోగాలే తప్ప ఆటలు కాదన్నారు. పరీక్షల సమయంలో ఈ ఆటలు ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్​లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండరు విడుదల చెయ్యాలని తెలుగు యువత డిమాండ్ చేశారు. ఆడుదాం సరే, జాబులెక్కడ జగన్? అంటూ నినాదాలతో కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ, ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలి, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాసర్జి, జనసేన యువజన నాయకులు ఆళ్ల హరి, చామర్తి ఆనంద్ సాగర్ తదితర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.