Telugu Desam Rythu Porubata Program Success: తెలుగుదేశం 'రైతు పోరుబాట కార్యక్రమం' విజయవంతం - Baggu Ramanamurthy Comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 19, 2023, 9:13 PM IST
Telugu Desam Rythu Porubata Program Success: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో బొంతు ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేయాలంటూ.. తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'రైతు పోరుబాట' కార్యక్రమం విజయవంతమైంది. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో 30 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో వందలాది మంది రైతులు పాల్గొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Baggu Ramanamurthy Comments: మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ..''2018 తెలుగుదేశం హయాంలో బొంతు ఎత్తిపోతల పథకాన్ని 180 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పనులు నిలిచిపోయాయి. దాదాపు 12వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ఎత్తిపోతల పథకం పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు రైతు పోరుబాట కార్యక్రమం చేపట్టాం. ధర్మలక్ష్మీపురం నుంచి ప్రారంభమైన ఈ పోరుబాట.. బొంతు ఎత్తిపోతల పథకం మీదుగా సారవకోట వరకు సాగింది. ఈ యాత్రలో సాగునీరు లేక కష్టాలు పడుతున్న రైతుల బాధలు తెలుసుకున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బొంతు ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం'' అని ఆయన అన్నారు.