Teachers Unions Indefinite Strike on CPS Cancellation సీపీఎస్ రద్దుపై ఈ నెల 18 నుంచి 20 వరకు నిరవధిక దీక్షలు: ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 11:01 PM IST

Teachers Unions Indefinite Strike on CPS Cancellation: 'సీపీఎస్ విధానం వద్దు-పాత పెన్షన్ విధానమే ముద్దు' అనే నినాదంతో ఈ నెల 18వ తేదీ నుంచి 20 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక దీక్షలు చేపట్టనున్నట్లు.. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వెల్లడించింది. సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చింది. ఈ నెల 18న రాష్ట్ర యూటిఎఫ్ కేంద్రంలో, 19న అన్ని జిల్లా కేంద్రాలు, 20న తాలూకా, డివిజన్ కేంద్రాల్లో నిరవధిక దీక్షలు చేపట్టబోతున్నామని.. అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తెలిపారు.

Venkateswarlu, Prasad Comments: ''సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు.. ఈ నెల 18 నుంచి 20 వరకు నిరవధిక దీక్షలు చేపట్టబోతున్నాం. ఈ నెల 18న రాష్ట్ర యూటిఎఫ్ కేంద్రంలో, 19న అన్ని జిల్లా కేంద్రాలు, 20న తాలూకా, డివిజన్ కేంద్రాల్లో దీక్షలు చేస్తాం. ప్రభుత్వాన్ని సీపీఎస్ రద్దు చేయమని పదే పదే అడుగుతుంటే.. పోలీసుల చేత మాపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈనెల 18 నుంచి తలపెట్టిన నిరవధిక దీక్షలకు విఘాతం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత. సీపీఎస్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు జీపీఎస్ పేరుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు సమయానికి జీతాలు ఇవ్వమని అడిగితే మంత్రులు, ఎమ్మెల్యేలు కించపరిచేలా మాట్లాడుతూన్నారు. ఇప్పటికైనా సీపీఎస్ రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధించాలి.'' అని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌లు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.