Lokesh comments on Sakshi fake news: మేము ఏ తప్పూ చేయలేదు.. నేనెవరినీ వదిలిపెట్టను: నారా లోకేశ్ - nara lokesh
🎬 Watch Now: Feature Video
TDP youth leader Nara Lokesh Comments: తాను ఏ తప్పూ చేయలేదని.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై, సాక్షి పత్రిక తప్పుడు కథనాలపై గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్డులో కేసు వేసిన లోకేశ్.. వైసీపీ నేతలపై వేసిన పరువు నష్టం కేసుకు సంబంధించిన వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పించారు. అనంతరం కోర్టు నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న లోకేశ్.. మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదని.. అందుకే ఏ ఒక్క ఆరోపణనూ నిరూపించలేకపోయారని ఆగ్రహించారు.
నేనెవరినీ వదిలిపెట్టను.. నారా లోకేశ్ మాట్లాడుతూ..''వైఎస్సార్సీపీ ఆరోపణలపై, నాపై సాక్షి పత్రిక రాసిన తప్పుడు కథనాలపై కోర్టులో కేసు వేశాను. దాంతోపాటు పరువునష్టం కేసులో వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు ఇచ్చాను. సీఎం జగన్ ఓ నియంత.. తల్లిని, చెల్లిని బయటకు పంపేశారు. నాపై, మా కుటుంబంపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు. మా అమ్మ, నా భార్యతో పాటు దేవాన్ష్‌ను కూడా విమర్శించారు. మేమే ఏ తప్పు చేయలేదు. అందుకే ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు. జగన్ మాదిరిగా తండ్రిని అడ్డుపెట్టుకొని తప్పుడు పత్రికలు నడపలేదు.. తప్పుడు వ్యాపారాలు చేయలేదు. నేనెవరినీ వదిలిపెట్టను.. నాపై తప్పుడు కథనాలు రాసిన మీడియాపైనా పరువు నష్టం కేసులు పెడతా. నేను తప్పుచేస్తే కచ్చితంగా మా నాన్నే జైలుకు పంపుతారు. ఎస్సీల భూములు లాక్కునేందుకు ఈ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. మేము ఉన్నంతకాలం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. అన్ని వర్గాల ప్రజలు వైకాపా బాధితులుగా మారారు. పోలీసులు కూడా వారి ఇబ్బందులను వాట్సాప్‌లో పంపుతున్నారు.'' అని అన్నారు.