BTech Ravi on CM Jagan: సీఎం జగన్‌పై చెక్ బౌన్స్ కేసు పెడతాం: బీటెక్ రవి - TDP incharge BTech Ravi comment
🎬 Watch Now: Feature Video
BTech Ravi Fire On Cm Jagan: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైయస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామని.. పులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి తెలిపారు. ఈ కార్యక్రమానికి పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి, చక్రాయపేట, వేముల మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో.. టీడీపీ యాప్ ఫ్యూచర్స్, ఆర్టీఎస్, ఓటర్ హౌస్ మ్యాపింగ్‌పై పార్టీ నేత హర్షవర్ధన్ ట్రైనింగ్ ఇచ్చారని పేర్కొన్నారు.
సీఎం జగన్‌పై చెక్ బౌన్స్ కేసు పెడతాం.. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ.. ''రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. పార్టీ కార్యకర్తలు సంసిద్దంగా ఉండాలి. ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి పథకానికి రూ.1179 కోట్ల నిధులను విడుదల చేసి చాలా రోజులైంది. కానీ, ఇప్పటికీ సగం మంది అకౌంట్లలో డబ్బులు పడలేదు. పంటల బీమా విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. నియోజకవర్గంలో అమ్మఒడి నిధులు జమకాని వారి జాబితాను తీసుకొని.. మరో రెండు రోజుల్లో పోలీస్ స్టేషన్‌లో సీఎం జగన్ రెడ్డిపై చెక్ బౌన్స్ కేసు పెట్టనున్నాం. ఈ రెండు రోజుల సమయంలో ముఖ్యమంత్రి నిధులు జమకాని ఖాతాల్లో డబ్బులు వేయాలి. చీనీ చెట్ల బీమా విషయంలో కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.