TDP Sympathizers Complaint Against Police: అనంతపురం ఎస్సైపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు.. - అనంతపురం ఎస్సైపై ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
TDP Sympathizers Complaint Against Police: అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ సానుభూతిపరులు అన్నారు. సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కనగానపల్లె పోలీసు స్టేషన్లో ఎస్సై హనుమంత్ రెడ్డి, కానిస్టేబుల్ సత్యనారాయణ అక్రమంగా కేసులు పెట్టారని బాధితులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితులు కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. గొడవ జరిగిన సమయంలో బాధితులు లేకున్నా.. పోలీసులు వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారపార్టీ నాయకుల అనుచరులుగా వ్యవహరిస్తూ తమపై అక్రమ కేసులు పెడుతున్న ఎస్సై, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.
"నేను టీడీపీ క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. సోషల్‌మీడియా, పార్టీ కార్యక్రమాల్లో నేను చురుగ్గా పాల్గొంటుంటాను. దీనివల్ల ఎమ్మెల్యే, మండలనాయకుల ప్రొద్బలంతో.. పోలీసులు మాపై అక్రమంగా కేసులు బనాయించారు. దీంతోపాటు మమ్మల్ని దుర్భాషలాడుతూ వేధిస్తున్నారు. దీనిపై కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాము." - చంద్రమోహన్, బాధితుడు