TDP sympathizers Agricultural Implements burnt: రాజకీయ కక్షతో టీడీపీ సానుభూతిపరుల వ్యవసాయ సామగ్రి దహనం.. రూ.3లక్షల నష్టం - వ్యవసాయ సామగ్రి దహనం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2023, 1:19 PM IST
TDP sympathizers Agricultural Implements burnt: వ్యవసాయ పనిముట్లకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురం గ్రామంలో.. టీడీపీ సానుభూతిపరులైన నలుగురు రైతులకు చెందిన ట్రాక్టర్, డ్రిప్‌వైర్లు, స్పేర్ పంప్, గేట్ వాల‌్, సింటెక్ ట్యాంక్.. అన్నింటికీ నిప్పంటించి నాశనం చేశారని వాపోయారు. సుమారు 3లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. తమ జీవనాధారమైన వ్యవసాయ పరికరాలకు నిప్పు పెట్టిన వారిని గుర్తించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాము తెలుగుదేశం పార్టీకి చెందినవారిమనే ఉద్దేశంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని బాధితులు వాపోయారు.
"వ్యవసాయనికి సంబంధించిన ట్రాక్టర్, డ్రిప్‌వైర్లు, స్పేర్ పంప్, గేట్ వాల‌్, సింటెక్ ట్యాంక్ అన్ని పనిముట్లను నిప్పు పెట్టి నాశనం చేశారు. సుమారు 3లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. మా జీవనాధారమైన వ్యవసాయ పరికరాలకు నిప్పు పెట్టిన వారిని గుర్తించి మాకు న్యాయం చేయాలి. మేము తెలుగుదేశం పార్టీకి చెందినవారిమనే ఉద్దేశంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తాము." - బాధిత రైతులు