TDP Protests Against Chandrababu Arrest: 'బాబుతో మేము సైతం'.. కంటతడి పెట్టుకున్న మహిళ - కనిగిరి లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2023, 6:03 PM IST
TDP Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగలు రగిలాయి. ఎక్కడికక్కడ రోడ్లపై టీడీపీ రాస్తారోకోలు, ఆందోళనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత చర్యలు మానుకుని.. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ దీక్షలు కొనసాగుతున్నాయి.
కనిగిరిలో రిలే దీక్షలు.. ప్రకాశం జిల్లా కనిగిరిలో.. పార్టీ ఇంఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రెండోరోజూ 'బాబుతో మేము'(Babutho Memu)సైతం అంటూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మేము సైతం బాబుతో అంటూ నినాదాలు చేశారు. జై బాబు(Jai Babu) అంటూ నినాదాలతో హోరెత్తించారు. అదే సమయంలో ఓ మహిళ చంద్రబాబు జైల్లో పడుతున్న బాధను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టుకున్నారు. దీంతో సమావేశంలో ఉన్న మహిళలందరూ తమ బాధను బయటకు వెళ్లబుచ్చుకోలేక బాధలను దిగమింగి కన్నీరు కార్చారు.