TDP Chaitanya Yatra: బాపట్ల జిల్లాలో ప్రజా చైతన్య బస్సు యాత్ర.. హాజరైన టీడీపీ నేతలు - Praja Chaitanya Yatra
🎬 Watch Now: Feature Video
TDP Praja Chaitanya Yatra: వైసీపీ రాక్షస పాలనను ప్రజలకు వివరిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రజా చైతన్య బస్సు యాత్ర బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఈ బస్సు యాత్రలో బాపట్ల పార్లమెంటరీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, టీడీపీ నేతలు పంచుమర్తి అనురాధ, పిల్లి మాణిక్యరావు, మాజీ ఎంపీలు శ్రీరాం మాల్యాద్రి, కొనకళ్ల నారాయణ, బాపట్ల నియోజకవర్గ టీడీపీ బాధ్యుడు వేగేశన నరేంద్ర పాల్గొన్నారు. బస్సు యాత్రకు ఈపూరుపాలెం టీడీపీ ఇంచార్జి ఎంఎం కొండయ్య.. పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చీరాల- ఈపురుపాలెం రోడ్డు గుంతలమయం అయిందని సెల్ఫీ దిగి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. ఈపూరుపాలెం ఆటోనగర్లో టీడీపీ హయాంలో కేటాయించిన భూములు.. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఆ భూముల్లో ఎటువంటి అభివృద్ది జరగలేదని, లబ్దిదారులకు భూములను కేటాయించ లేదని, తక్షణమే ఆ భూములను వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. లేకుంటే టీడీపీ ఆధికారంలోకి రాగానే భూములను లబ్దిదారులకు కేటాయిస్తామని టీడీపీ ఇంచార్జి కొండయ్య తెలిపారు.