TDP on AP Fiber Grid Project 8వేల కోట్ల ఫైబర్ గ్రిడ్‌ను చంద్రబాబు దూరదృష్టితో రూ.300 కోట్లతోనే సాధించారు.. రాజకీయ కక్షతోనే ఆరోపణలు : టీడీపీ - ఫైబర్ గ్రిడ్ ఆరోపణలపై సీఐడీపై టీడీపీ ఫైర్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2023, 5:27 PM IST
|Updated : Sep 26, 2023, 7:29 PM IST
TDP on AP Fiber Grid Project కేవలం 149 రూపాయలకే ఇంటింటికి కేబుల్, ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి గత ప్రభుత్వం అద్భుతం సృష్టించిందని తెలుగుదేశం శాసనసభాపక్షం తెలిపింది. దాదాపు 8 వేల కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు దూరదృష్టితో కేవలం 300 కోట్లతోనే సాధించారని గుర్తు చేసింది. కేవలం 300 కోట్లు పెట్టుబడి పెడితే ఇప్పటికే దాదాపు 900 కోట్లు తిరిగి వచ్చాయని తెలుగుదేశం నేత అశోక్‌బాబు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఆ ప్రాజెక్ట్ చేపట్టిన సంస్థలను బెదిరించి చంద్రబాబు పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆయన ఆరోపించారు.
ఏపీ ఫైబర్ నెట్‌లో (AP Fiber Net) రూ.120 కోట్లు దుర్వినియోగమయ్యాయని, టెరాసాఫ్ట్ ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ నకిలీదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారని అశోక్‌బాబు అన్నారు. తానే సర్టిఫికెట్ ఇచ్చినట్లు సిగ్నమ్ సంస్థ యజమాని గౌరీ శంకర్ చెప్పారని, ప్రభుత్వం మారాక సర్టిఫికెట్ నకిలీదని గౌరీ శంకర్ మాట మార్చారని, ప్రతిఫలంగా గౌరీశంకర్‌కు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదవి ఇచ్చారని ఆయన తెలిపారు. టెండర్ దాఖలు చేసే రోజుకు టెరాసాఫ్ట్ సంస్థ బ్లాక్ లిస్టులో లేదని అశోక్‌బాబు అన్నారు.