TDP Pattabhi on JP Power Ventures Sand Mining: ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిపి.. జీఎస్టీ ఎందుకు చెల్లించడం లేదు..?: పట్టాభి - పట్టాభి X మంత్రి పెద్దిరెడ్డి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 9:41 PM IST
TDP Kommareddy Pattabhiram on JP Power Ventures Sand Mining: ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్‌కు సంబంధించి.. 15వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తామని చెప్పిన జేపీ పవర్ వెంచర్స్ సంస్థ.. 14వందల కోట్ల టర్నోవర్ చూపించటం ఏంటని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. ప్రతిరోజు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిపి అమ్మకాలు చేస్తే.. జీఎస్టీ చెల్లింపునకు సంబంధించి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ సున్నాలు ఎందుకు పెట్టిందో మంత్రి పెద్దిరెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థ రెండేళ్లలో టర్నోవర్ 1421.38 కోట్ల రూపాయలు మాత్రమేనా అని ప్రశ్నించారు. అంటే ఈ రెెండేళ్లలో కేవలం 2 కోట్ల 99లక్షల టన్నుల ఇసుక మాత్రమే తవ్వకాలు జరిపి విక్రయించారా అని నిలదీశారు. సంస్థ నష్టాలతో నడిచిందా అని నిలదీశారు. సంవత్సరానికి మొత్తం కోటిన్నర టన్నుల ఇసుక కూడా అమ్మలేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంటే జేపీ సంస్థ నష్టాల్లో కొనసాగిందా అన్నారు.