జగన్‌రెడ్డికి దమ్ముంటే సిట్టింగులందరికీ సీట్లివ్వాలి : టీడీపీ నక్కా ఆనంద్‌బాబు
🎬 Watch Now: Feature Video
TDP Nakka Anandababu Fire on CM Jagan: వైనాట్ 175 అంటున్న జగన్‌రెడ్డి దమ్ముంటే సిట్టింగులందరికీ సీటివ్వాలని తెలుగుదేశం సవాల్ విసిరింది. ఓటమి భయం పట్టుకోవడం వల్లే ఉద్యోగులను బదిలీ చేసినట్లు ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. పులివెందులకే దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న జగన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని సింగిల్‌గా రమ్మనడం హాస్యాస్పదమన్నారు. దీంతోపాటు ఏపీకి రావాలంటే జగన్ తల్లీ, చెల్లీ భయపడిపోయే పరిస్థితి ఉందని నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు. వైసీపీలో అసంతృప్తి నేతలంతా షర్మిల వస్తుందేమోనని అటువైపు చూస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశంతోనూ చాలామంది వైఎస్సార్సీపీ అసంతృప్త నేతలు టచ్‌లో ఉన్నారని తెలిపారు.
Nakka Anand Babu Sensational Comments on YS Jagan: ఉద్యోగుల్ని బదిలీ చేసినట్లు ఇష్టం వచ్చినట్లు నేతల్ని బదిలీ చేసుకుంటున్నారని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన జగనే తొలుత బదిలీ అవ్వాలని నక్కాఆనంద్‌బాబు వ్యాఖ్యానించారు. ఇంఛార్జ్‌ల మార్పుతో వైఎస్సార్సీపీ ఓటిమిని జగన్ ముందే ఒప్పుకున్నాడన్నారు. ఎన్ని మార్పులు చేసుకున్నా ప్రజాగ్రహం నుంచి జగన్ తప్పించుకోలేడని తెలిపారు. ఐప్యాక్, వాలంటీర్లతో నడిచే స్ట్రక్చర్ వైఎస్సార్సీపీదని, కార్యకర్తల బలం, ప్రజాదరణతో నడిచే స్ట్రక్చర్ తెలుగుదేశందని అన్నారు. ప్రతి ఎస్సీ నియోజకవర్గంలో జగన్ షాడో ఎమ్మెల్యేలదే పెత్తనమని నక్కాఆనంద్‌బాబు విమర్శించారు.