'ప్రజల నుంచి దూరం చేసేందుకు వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే సీఎం' - ఏపీ రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 2, 2023, 12:58 PM IST
TDP MP Rammohan Naidu Fire on CM Jagan: చంద్రబాబును ప్రజల నుంచి దూరం చేసేందుకు.. వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని.. తెలుగుదేశం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే.. కేసుల మీద కేసులు పెట్టి కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఎన్ని కేసులు పెట్టినా.. టీడీపీ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
"టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ప్రజల నుంచి దూరం చేసేందుకు.. వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. చంద్రబాబు నాయుడుకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే.. కేసుల మీద కేసులు పెట్టి కక్షసాధిస్తున్నారు. జగన్ ఎన్ని కేసులు పెట్టినా.. పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబు సీఎం అవుతారు." - కింజరాపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ