ETV Bharat / state

రెచ్చిపోతున్న ఇసుక అక్రమార్కులు- మంటల్లో జేసీబీ - ILLEGAL SAND MINING IN BAPATLA

యథేచ్చగా ఇసుక దోపిడీ - చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు- ఆధిత్య పోరులలో జేసీబీ దహనం!

illegal_sand_mining_in_bapatla_distric
illegal_sand_mining_in_bapatla_distric (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 15 hours ago

Illegal Sand Mining in Bapatla District : ఇసుక అక్రమ వ్యాపారం బాపట్ల జిల్లా చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో జోరందుకుంది. ఇసుక రవాణాకు ఎటువంటి అనుమతుల్లేకపోయినా పెద్దల అండతో దర్జాగా అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. దీనిపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో యథేచ్ఛగా జేసీబీలు పెట్టి మరీ తవ్వేస్తున్నారు.

అయినా అదికారులు ఆవైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది. జిల్లా అదికారులు ప్రశ్నిస్తే తప్ప ఇసుక అక్రమ రవాణా చేసే ట్రాక్టర్లను పట్టుకోని పరిస్థితి ఉండడం గమనార్హం తవ్వకాల్లో అక్రమార్కుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. చీరాల మండలం బోయిన వారిపాలెం-స్టువార్టుపురం మధ్య ఉన్న టీ.పీ పంపింగ్ స్కీం వద్ద ఉంచిన జేసీబీని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు.

ప్రభుత్వం అవకాశమిచ్చినా సహకరమేదీ? - అధికారుల వైఖరితో ఇసుక కష్టాలు

జేసిబి పూర్తిగా దహనమయింది. ఇసుక రవాణాదారుల మధ్య గొడవలే దీనికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీబీకి నిప్పుపెట్టిన విషయమై యజమాని రామకృష్ణ చీరాల రూరల్ పోలీసులకు పిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ఈపూరుపాలెం పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

ఆ నేత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - 100కోట్ల కుచ్చుటోపి - సీఐడీకి కేసు బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.