కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రంలో పనులు చేయడం లేదు - లోక్​సభలో గళమెత్తిన కేశినేని - Keshineni Nanis Parliament Speech

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 5:03 PM IST

TDP MP Kesineni Nani Lok Sabha Speech : కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రం పనులు చేయడం లేదని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని లోక్​సభలో గళమెత్తారు. విజయవాడలో వరదనీటి పారుదల వ్యవస్థ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ కోసం రూ. 1000 కోట్లు మంజూరు చేస్తే ఇప్పటికీ పనులు పూర్తికాలేదన్నారు. ఈ విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకుని పనులు పూర్తిచేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి పనుల పురోగతిని సమీక్షిస్తామని చెప్పారు. 

విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లకు 2015 మార్చిలో కేంద్ర ప్రభుత్వం  రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. విజయవాడలో వరదనీటి పారుదల వ్యవస్థ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ కోసం కేంద్రం నిధులిచ్చింది. విజయవాడకు రూ. 468 కోట్లు, గుంటూరుకు రూ.532 కోట్లు ఇచ్చింది. తొమ్మిదేళ్లు గడిచినా విజయవాడలో 30 నుంచి 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2019లో రాష్ట్ర ప్రభుత్వం మారాక విజయవాడ, గుంటూరులో పనులన్నీ ఆపేశారు. ఈ పనులు పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరుతున్నాను. - కేశినేని నాని, విజయవాడ ఎంపీ

ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రం ఇచ్చిన నిధులను సరిగ్గా, సకాలంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. విజయవాడలో అమృత్, అమృత్-2 కింద రూ. 128.5 కోట్ల పనులు చేపట్టారు. గతంలో మొదలైన వరదనీటి పారుదల పనులను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలి. ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తాం. 2014 మే నుంచి కేంద్రం ఇచ్చిన నిధులను అన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకున్నాయి. కానీ విజయవాడలో 33 శాతం పనులే అయ్యాయి. ప్రస్తుత పరిస్థితిని, పనులు ఆగడానికి కారణాలను కనుక్కుంటాం. - హర్దీప్‌సింగ్ పురి, కేంద్రమంత్రి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.