TDP MLC Ashokbabu Fires On CM Jagan హిందూ ఆచారాలను కించపర్చేలా సీఎం బాటలో నడుస్తున్న వైసీపీ నేతలు! జగన్, కొడాలి నానిపై టీడీపీ ఫైర్ - Jagan Wife Bharathi

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2023, 3:31 PM IST

Updated : Sep 19, 2023, 4:08 PM IST

TDP MLC Ashokbabu Fires On CM Jagan: ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను హేళన చేసేలా వ్యవహరించడం జగన్ రెడ్డికే చెల్లిందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ధ్వజమెత్తారు. తిరుమలేశుడి సన్నిధిలో జగన్ రెడ్డి విపరీత చేష్టలు, తితిదే వ్యవహారశైలిపై సదరు విభాగం ఛైర్మన్, దేవాదాయ శాఖ మంత్రి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు ఎందుకు సమర్పించలేదో జగన్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మహాద్వార దర్శనం నిబంధనను అధికారపార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ఎందుకు పాటించలేదో టీటీడీ సమాధానం చెప్పాలన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పరమ పవిత్ర క్షేత్రంలో జరిగిన తప్పిదం ఏదైనా అది ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో హిందూ మతాన్ని, హైందవధర్మాన్ని కించపరిచేలా వ్యవహరిస్తామంటే హిందూ సమాజం క్షమించదని హెచ్చరించారు. టీటీడీ వ్యవస్థ హిందువుల మనోభావాలు మంటగలిపి.. నిబంధనలు, ఆచారాలు, సంప్రదాయాలు గాలికొదిలేయటం ముఖ్యమంత్రి సేవలో తరించిందన్నారు. 

Last Updated : Sep 19, 2023, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.