TDP MLC Accused of Changing Polling Booths: 'ఇష్టానుసారంగా పోలింగ్ బూత్​లు మారుస్తున్నారు'.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు - ఎమ్మెల్సీలు అశోక్ బాబు ఆరోపణలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 5:08 PM IST

TDP MLC Accused of Changing Polling Booths: ఇష్టానుసారం జరుగుతున్న పోలింగ్ బూత్ ల మార్పుపై తెలుగుదేశం ఎమ్మెల్సీలు అశోక్ బాబు, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఫ్యాక్షన్ ప్రాంతమైన గురజాల నియోజకవర్గంలో 6 గ్రామాల్లో 18 బూత్ లను ప్రతిపక్షాలతో సంప్రదించకుండానే మార్చేశారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే(MLA) కాసు మహేశ్ రెడ్డి సూచనతోనే అధికారులు బూత్ లు మార్చారన్నారు. పిన్నెల్లిలో ఒకేచోట 9 బూత్ లు ఏర్పాటు చేశారని, అది ఎలా సాధ్యమైందంటే అధికారులు సమాధానం చెప్పడంలేదని మండిపడ్డారు. 

ఎన్నికల కమిషన్(Election Commission) ఆదేశాలు, నిబంధనలు ఏవీ క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకావడం లేదని అశోక్ బాబు(Ashok Babu) విమర్శించారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలు పరిశీలిస్తామని, కొత్త ఓటర్ జాబితా వచ్చాక సమస్య పరిష్కారంపై దృష్టిపెడతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పారని ఎమ్మెల్సీలు తెలిపారు. పోలింగ్ బూత్ ల మార్పుపై ఏపీ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకుంటే, కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఆశ్రయిస్తామని వెల్లడించారు. పోలింగ్ బూత్(Polling Booths) లు మార్చేసి, ఇష్టానుసారం ఓటింగ్ చేయించుకునే ఆలోచనలు అధికారపార్టీ చేస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్సీలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.