TDP MLA Payyavula Keshav Hero Vishal Visits Tirumala: చంద్రబాబు కోసం.. తిరుమలలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పూజలు .. - పయ్యావుల కేశవ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2023, 1:52 PM IST
TDP MLA Payyavula Keshav Hero Vishal Visits Tirumala: టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తారని బలంగా నమ్ముతున్నట్లు ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు కోసం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆయన వివరించారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆశీస్సులు చంద్రబాబుపై ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.
మరోవైపు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్వామివారిని దర్శించుకున్న సమయంలో.. సినీ నటుడు విశాల్ స్వామి వారిని దర్శించుకున్నారు. విఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. టీటీడీ ఆలయాధికారులు ఇరువురికి ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న విశాల్.. మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు నటుడు విశాల్‌కు వేదాశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలను అందించారు. దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన ఆనంతరం విశాల్ అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు.